హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి రాష్ట్రంలో ప్రాచారానికి రారున్నారు. వొచ్చే రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అక్టోబరు నెల రెండో వారంలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. మొత్తం మూడు రోజులపాటు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. రాహుల్ పర్యటనకు కాంగ్రెస్ అగ్ర నేతలు కార్యక్రమాలు రెడీ చేస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది వారాల క్రితమే హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం, కాంగ్రెస్ విజయభేరి పేర్లతో భారీ సభలు కూడా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన ఈ సభలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హావి•లను ప్రకటించింది. అధికారంలోకి వొచ్చేది తామేనని..ఆ వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తుక్కుగూడ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో బాగా ఉత్సాహం నింపింది.



