మరోమారు కేసీఆర్ పోటిచేయడం గజ్వేల్ కే గర్వకారణం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసిఆర్ మరోమారు గజ్వేల్ నుండి పోటీ చేయడం గజ్వేల్ ప్రాంతానికే గర్వకారణం అని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.తెలంగాణ సాధకునిగా 2014లో గజ్వేల్ లో కేసిఆర్ అడుగుపెట్టిన రోజు నుండి ఈ తొమ్మిదేళ్లలో గజ్వేల్ అనూహ్య రీతిలో అన్ని రంగాల్లో విశేషమైన అభివృద్ధి కొనసాగుతున్నదని ఈ అభివృద్ధి పరంపర ఇదే విధంగా కొనసాగాలంటే అది కేవలం కేసిఆర్ తో మాత్రమే సాధ్యమని అన్నారు.కేసిఆర్ గజ్వేల్ నుండి ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వల్లనే ఇవ్వాళ గజ్వేల్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజాప్రతినిధులు,అధికారులు గజ్వేల్ లో జరిగిన అభివృద్ధిని చూసేందుకు నిరంతరం తండోప తండాలుగా వస్తున్నారని అన్నారు.కేసిఆర్ నాయకత్వంలో ఇవ్వాళ తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా గజ్వేల్ వర్ధిల్లుతుండడం ఈ ప్రాంత ప్రజానీకానికి ఎంతో గర్వంగా ఉందన్నారు.ఇంత గొప్ప గౌరవాన్ని అందించిన కేసిఆర్ నాయకత్వాన్ని గజ్వేల్ ప్రజలు ఎన్నటికీ వదులుకోలేరనిఅన్నారు.పార్టీలు,కులాలు,మతాలు, సంఘాలకు అతీతంగా కేసిఆర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.గజ్వేల్ గడ్డ కేసిఆర్ కి అడ్డా అని గులాబీ కోట అని అన్నారు.కేవలం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కేసిఆర్ రెండు చోట్లా పోటీ చేస్తున్నారని రెండు చోట్లా భారీ మెజారిటీతో ప్రజలు కేసిఆర్ ని ఆశీర్వదిస్తారని అన్నారు.గజ్వేల్ నియోజకవర్గంలో ఎవ్వరు పోటీ చేసినా ప్రతిపక్షాలకు డిపాజిట్ల కోసమే పోటీ తప్ప కేసిఆర్ విజయాన్ని ప్రజలెప్పుడో ఖాయం చేశారని అన్నారు.కేసిఆర్ ఎక్కడి నుండి పోటీ చేసినా అప్రతిహతంగా గెలుస్తూ వస్తూనే ఉన్నారని, కేసిఆర్ లాంటి గొప్ప నాయకుడు గజ్వేల్ నుండి పోటీ చేయడమే పెద్ద అవకాశమని కేసిఆర్ ని ఏకపక్ష మెజారిటీతో గెలిపించి, మరోసారి మన గజ్వేల్ ప్రతిష్టను,గౌరవాన్ని మరింత పెంచుకుందాం అని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మార్కేట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు నిజామోద్దీన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *