కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : ఎమ్మెల్యేగా తనకు మరొక అవకాశాన్ని ఇస్తే కొత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతానని, రానున్న రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిని చేపడుతామని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. బుధవారం ప్రగతి నగర్ లోని కే.జి.ఆర్ కన్వెన్షన్ నందు జరిగిన చేరికల కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ అధ్యక్షులు అనిల్ కరుటూరితో పాటు పలువురు టీడీపీ నాయకులూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనా, సంక్షేమ పథకాలు అందిస్తూ నియోజక వర్గాన్ని అగ్రపథాన నిలిపామన్నారు. అనంతరం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ అధ్యక్షులు అనిల్ కరుటూరి, ప్రగతి నగర్ టీడీపీ అధ్యక్షులు నాగేశ్వర్ రావు, సీనియర్ నాయకులూ కిరణ్ తలసాని, తెలుగు యువత ప్రెసిడెంట్ దిలీప్ వర్మ, టీడీపీ యూత్ సెక్రటరీ గంగాధర్, ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి(7 వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్), ఆవుల సురేష్ యాదవ్ (13వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్), ఆశ నర్సింగ్ రావు (10 వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్), బాల నర్సమ్మ (33వ డివిజన్ సీనియర్ నాయకురాలు) బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు మేకల వెంకటేష్, సురేష్ రెడ్డి, రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ నాయక్, చిట్ల దివాకర్, సీనియర్ నాయకులూ గోపాల్ రెడ్డి, జగదీష్ యాదవ్, రాము, డివిజన్ అధ్యక్షులు ముత్యాలు, బిక్షపతి, అశోక్, శ్రీకర్ గుప్త, కార్యనిర్వాహక కార్యదర్శి సాంబశివ రెడ్డి, కార్యదర్శి స్వామి తదితరులు పాల్గొన్నారు.
మరొకసారి అవకాశం ఇవ్వండి కుత్బుల్లాపూర్ ను అగ్రగామిగా నిలుపుతాను కే పీ. వివేకానంద్




