నాడు ఘనంగా నివాళులర్పించి ఆయన త్యాగాన్ని కొనియాడలేని పరిస్థితి నేటికీ ఉండడం విచారకరం. పాలక ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్య తీసుకోకపోవడం వలన ఆ మహనీయుని మరణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. 1945 ఆగస్టు 18న తైవాన్లు జరిగిన విమానం ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు పలు దర్యాప్తుని వేదికలు చెబుతున్నాయి. కానీ ఇట్టి విషయాన్ని ముఖర్జీ కమిషన్ ధ్రువీకరించలేదు. జపాన్ రాజధాని టోక్యో లోని రంకోజి ఆలయంలో ఉంచిన నేతాజీ అస్తికలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన అతని మరణం మిస్టరీని ఛేదించవచ్చని ఆయన కుమార్తె అనిత అభిప్రాయపడ్డారు. అయినా ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడంతో ఇంకను అనిచ్చితి నెలకొని ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమైన సుమారు ఐదు నెలల తర్వాత రంగూన్ లో నేతాజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇది భారతదేశం అంతటా సాంప్రదాయంగా కొనసాగుతు ఉంది. పశ్చిమబెంగాల్, రaార?ండ్,త్రిపుర,అస్సాం రాష్ట్రాలలో నేతాజీ జయంతి అధికారికంగా సెలవు. 2021 లో 125వ జయంతి సందర్భంగా నేతాజీ జయంతిని పరాక్రమదివస్ జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది.
బ్రిటిష్ సామ్రాజ్యవాద కబంధహస్తాల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించినారు. ఆ త్యాగాల పునాదులపై నిలబడిన పాలక ప్రభుత్వాలు వారి ఆశయాలకు అనుగుణంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సమ సమాజ స్థాపన దిశగా అంతరాలు లేని సమాజాన్ని నిర్మించడంలో విఫలమయ్యాయి. తత్పలితంగ్షా 80 శాతం సంపద ఒక శాతం ఉన్న ప్రజల వద్దనే కేంద్రీకృతమైంది. దేశ ప్రగతికి అభివృద్ధికి విరోధం. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను కొనసాగించేందుకు ప్రజాస్వామికవాదులు.,బుద్ధి జీవులు కృషి చేయాలని ఆ దిశగా ప్రయత్నిస్తారని ఆశిద్దాం… -తండ సదానందం
(టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్, మహబూబాబాద్)





