కాలంతో పరుగెత్తడం
అలవాటు చేసుకున్నాం
మార్పు కోరుకోరడంపై
నిషేధం విధించుకున్నాం
విలువలకు శిలువేసి
వీధుల్లో ఊరేగిస్తున్నాం
శిలావిగ్రహాల పూజించి
మనిషిని ద్వేషిస్తున్నాం
మానవత కన్నా మతం
గొప్పదని వాదిస్తున్నాం
ప్రేమ ఆప్యాతల కాదని
విద్వేషాన్ని శ్వాసిస్తున్నాం
అనుబంధ వేళ్ళు పెరికి
ఆర్థిక బీజాలు వేస్తున్నాం
మనిషిగా కాక యంత్రమై
చుట్టూ పరిభ్రమిస్తున్నాం
యాంత్రిక జీవన తంత్రుల
అదే పనిగా మీటుతున్నాం
ఈ విష వైఖరులు
ఇలాగే కుదురుకుంటే..
మనుగడ ప్రశ్నార్థకం
జీవితం శిథిల శకలం
అందుకే ఇప్పటికైనా..
నవ జీవన సేద్యం చేద్దాం
విలువల బీజం విత్తుదాం
ఆత్మీయ జల్లులు కురిపిద్దాం
అనుబంధాల అంటుకడదాం
సమైక్యతా చిగుళ్లు తొడిగిద్దాం
మానవీయ సుగంధం పరుద్దాం
మమతల పందిరై అల్లుకుందాం.
– కోడిగూటి తిరుపతి, 9573929493




