:మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 16 : మహేశ్వరం మండలం మన్సాన్ పల్లి వద్ద నిర్మించిన 2412 డబూల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులకే కేటాయించాలనే డిమాండ్ తో ఆగస్టు 18న. డి.సి.సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున దర్నాలో ఇళ్లు లేని నిరుపేద లందరు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధ వారం మన్సాన్ పల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన్సాన్ పల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం సిద్దమయిందని కె.సి.ఆర్. ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణం పూర్తయనా పేదలకు ఇవ్వడంలో జాప్తం జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లుగా అబద్ధాలు, మాయమాటలతో కాలం గడపుతుందని, ఎన్నికల ముందు అమలుకాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలచి అభివృద్ధి కోసమే బి.ఆర్.ఎస్.లో చేరినానని చెప్పుకుంటున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానికులకు పంపిణీ చేసి చిత్త శుద్ధి
చాటుకోవాలని సవాల్ విసిరారు. సమావేశంలో కార్పోరేటర్ చల్లా బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు. బి. రాజ్ కుమార్, ఎ. యాదయ్య ఎం. దశరథ.ఎన్.యాదయ్య.రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



