అవధులు లేని ఊహాలోకంలో
కళ్ళెం లేని గుర్రంలా
పరుగులుతీసే మనసు..
చిత్ర విచిత్రమైన ఊహలతో
కొత్తకొత్త ఆశల ఊసులతో
కలలో ఇలలో కనువిందుచేస్తూ
మాధుర్యాల పంటలను పండిస్తుంది
ఆశల స్వప్నాలలో
మరో ప్రపంచాన్ని ఊహిస్తుంది
రేపటి ఆలోచనల పర్యాన్ని కలగంటుంది
గత అనుభవాల అనుభూతుల్ని
నెమరు వేసుకుంటూ
జ్ఞాపకాల వీధుల్లో ప్రచారం చేస్తుంది
భావోద్వేగాలకు స్పందిస్తూ-
అలౌకికానందాన్నిచ్చే
భావ పరంపరలు పెల్లుబుకితే
ఝంఝూ మారుతమై పల్లవిస్తుంది!
వెతలు, వేదనలు తలెత్తితే
మౌనంగా రోదిస్తుంది!
మనసంటే మరేమో కాదు-
అనవరతం జనించే ఆలోచనల స్రవంతి!
బ్రతుకు బాటని నిర్దేశించే అధిపతి!
మనసు భారమైతే క్షణమొక యుగం!
మనసు తేలికైతే యుగమొక క్షణం!!
-పి.వి.ప్రసాద్,
9440176824
మనసు పోకడలు..!





