తెలుగు నాట బహుముఖ ప్రజ్ఞ కళ స్ఫూర్తి పొందే మహానుభవులు చాల మందే వున్నారు వారంతా నచ్చిన రంగాలలో మాత్రమే నిష్ణాతులు.అయితే విభిన్న రంగాలలో తమ సత్తా చాటి తెలుగు నాట తొలి తెలుగు పత్రికను స్థాపించిన మహనీయులుగా మాజీ ప్రధాని పీవీ చెప్పేవరకు ఎవరు పెద్దగా వారి గురించి తెలుసుకోలేక పోయారు. కీర్తిశేషులు భారతరత్న మాజీ ప్రధాని పీ.వీ. నరసింహారావు భారత ప్రధానిగా ఉన్న రోజులలో ఒకసారి హైదరాబాదులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ స్వర్ణోత్సవ సభ సందర్భంగా వారు చేసిన ఉపన్యాసంలో ఇరువురు కవుల పేర్లు ప్రస్తావిస్తూ కనీస సౌకర్యాలు లేకుండా అటవీ ప్రాంతం నుంచి పత్రిక నడిపిన విధానాన్ని ప్రస్తుతిస్తు తన ఎదుగుదల బాషా నైపుణ్యం నేర్చుకోవాలనే తపన ఇరువురు సోదరుల జీవితం ని స్ఫూర్తిగా తీసుకొవడం వల్లే వచ్చిందని తను ప్రధాని స్థాయి వరకు ఎదగాలనే తపన ఆ ఇరువురు సోదరుల స్ఫూర్తి అని చెప్పడం తో పలు భాషావేత్తలు కవులు, నాయకులు, ప్రసార మాధ్యమాలకు వెళ్లి ఒద్దిరాజు సోదరులు ఎవరో, వారిని గూర్చి తెలుసుకోవాలన్న తపన మొదలయింది 20వ శతాబ్ధమున మన తెలుగు నేలన అసలు బడికి కూడా పోకుండా,ఆధునిక చదువులు, డిగ్రీలు ఏవీ లేకుండా ఎన్నో వైవిధ్యమయిన రంగములలో తమ ప్రతిభనుచాటుకొని నాటికీ నేటికీ సమాజంలో ప్రేరణగా స్ఫూర్తి గా నిలుస్తు తెలంగాణ కీ మకుటయమాణంగా నిలిచారు వారే ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు మానుకోట తాలూకా ఇనుగుర్తి.
గ్రామంలో వెంకటరామారావు రంగనాయకమ్మ లకు 7 సంవత్సరాల వ్యత్యాసంతో జన్మించారు వీరి తల్లి తండ్రులు.వద్దే తొలి విద్యాభ్యాసం నేర్చుకునీ. తమ స్వయంకృషి తో ఏకసంథాగ్రాహులు గా ఏ పాఠశాలకు వెళ్లకుండా ఏ గురువూ పట్టుమని నాలుగు నెలలు కూడా చదువు చెప్పకుండానే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.చదువు పై వీరి ప్రత్యేక ఆసక్తి గ్రహించిన వీరి తండ్రి వెంకట రామారావు గారు హైదరాబాదు నుండి వసుచరిత్ర, మను చరిత్ర మొదలగు నలభై గ్రంధాలను కొని తెప్పించి ఇచ్చారు. ఆ గ్రంధాల అవపోశన తరవాత చరకుపల్లి గోపాలకృష్ణ శాస్త్రి వద్ద వేదాలను, షోడశ కర్మలను, దేవయాజ్ఞీకాన్ని నేర్చుకున్నారు. నా టి నిజాం ప్రభుత్వంలో స్థానిక లోకల్ ఫండు పాఠశాల లో పనిచేయు వనం కోటయ్య గారి వద్ద ఉర్దూ, ఫార్సీ భాషలు నేర్చుకున్నారు. తండ్రి గారు కరణీకం చేసేవారు. ఇనుగుర్తి గ్రామం చుట్టు పక్కల గ్రామాల పట్వారీలు అందరు అక్కడే వుండేవారు. వారందరి పహాణీలు రాయడం, జమాబంది నిర్వహించడం మూలాన వీరు చేసి తమ అవసరాలు, పుస్తకాల కొనుగోలు ఖర్చులు నిర్వహించుకునేవారు నిజాం పాలన లో ఉర్దూ మొదటి భాష అయినందున బడులలో తెలుగు నేర్చుకొనడం కూడా కష్టమవుతున్న రోజులలో విదేశీ భాష అయిన ఆంగ్లం నేర్చుకొనడం ఇంకా కష్టసాధ్యమైన పని. కాని సోదరులిరువురు ఆంగ్ల భాష ఎంతో శ్రమించి నేర్చుకుని సుసాధ్యం చేశారు. నీటిపారుదల శాఖలో పని చేస్తూ ఉండిన కెంప్ అనే అధికారి చెరువుల పని నిమిత్తం ఇనుగుర్తికి రాగా అతనిని వీరిరువురు పరిచయం చేసుకుని అతని వద్ద ఆంగ్ల అక్షరాలు నేర్చుకుని ఇంగ్లీష్ ప్రైమరీ లోని 26 పాటాలను 20 రోజులలో పూర్తి చేసినారు.

కేసముద్రం రైల్వే స్టేషన్ మాస్టర్ వద్ద కలోనియల్ ప్రొనౌన్సియేషన్ డిక్షనరీ ని శంకర్ నారాయణ ఇంగ్లీష్ డిక్షనరీ పొందడం ద్వారా, మానుకోట లో గల ఒక డాక్టర్ గారి వద్ద తీసుకొన్న టైమ్స ఆఫ్ ఇండియా పాత ఇంగ్లీష్ వార్తా పత్రికలను, మ్యాగజీన్లను చదవడం, వాటి శబ్దార్థాలను గ్రహిస్తూ ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యత పొందినారు. ఆ భాషలో కవిత్వం కూడా రాయగలిగారు.గ్రామం నుంచి వీరు తెనుగు అనే పత్రికను స్థాపించి నడిపారు. ఈ పత్రిక 1922 ఆగస్టులో 500 ప్రతులతో ఆరంభమై ఆరు సంవత్సరాలు తెలంగాణ ప్రజా చైతన్యానికి దోహదం చేసింది. వీరు 1918లో విజ్ఞానప్రచారిణీ గ్రంథమాలను స్థాపించి విజ్ఞానదాయకమైన పుస్తకాలను స్వంతంగా ప్రచురించారు తెలంగాణాలో విజ్ఞానవ్యాప్తికి తోడ్పడ్డారు. వీరు నిజాం కాలంలో తెలంగాణా ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేశారు. విజ్ఞాన రంగాన కాకుండ వీరు చేయని పని లేదు ఆసాధ్యం అన్న మాట లేకుండా ఎన్నో కొత్త అవిష్కరణలకు శ్రీకారం, చుట్టారు అందులో మచ్చుకు కుట్టుపనిలో నేర్పరులుగా మారి స్వంతంగా సూటుకేసులు తయారుచేసి ఆన్నాడు గ్రామాల్లో సుట్కేసులో బట్టలు పెట్టుకొని ప్రయాణాలు చేయవచ్చనే విషయాన్ని ప్రజలకు తెలిపారు ప్రజలకు వైద్య సేవలు అందించేందుక ఆయుర్వేదం హోమియోపతి నీ అవుపౌసన పట్టి వాటి పై మద్రాసు బెంగాల్ వెళ్లి పరీక్షలు రాసి డిగ్రీలు సాధించి నూతన ఔషధాలను తయారుచేశారు శస్త్ర చికిత్సలు ఆపరేషన్లు చేసేవారు , నాడు పల్లెలో జీవన ఉపాధి కోసం సబ్బులు, రక రకాల రంగులతో కూడిన సువాసన వెదజల్లే పెన్నులకు ఇంకులు తయారు చేసేవారు వడ్రంగి పని నేర్చుకొని వారి ఇంటికి కావల్సిన గృహోపకరణాలు తయారుచేసుకున్నరు .
(నేటికీ వారు తయారు చేసిన కుర్చీలు తలుపులు కిటికీలు ఇనుగుర్థీ గ్రామంలో చూడవచ్చు)అచ్చుయంత్రాలను తయారు చేపించుకొని ముద్రణలు వేసేవారు. వాస్తు నిపుణులు తాపీ పనిచేసి తమ భవనానికి ఆనాడే ఆధునిక గవాక్షాలను ని డంగు సున్నం తో నిర్మించారు..నేటికీ అవి అలాగే వున్నాయ్ .గ్రామానికి సైకిల్ , గ్రామఫోన్ ,థర్మాస్ ప్లాస్కులు లు పట్టుకొని వచ్చి గ్రామాల ప్రజలకు ఆధునిక జీవనం పై అవగహన పెంచారు పశువులకు వైద్యం చేసి పశు వైద్యులుగాని గుర్తింపు పొందారు. ఆధునిక పద్దతిలో ఆనాడే పొలంలో నాగలి పట్టి సేద్యం చేసి వ్యవసాయంలో కొత్తపుంతలు తోక్కించారు నాడు గ్రామీణ ప్రాంతాల్లో వున్నా అంటరానితనం రూపు మాపడం కోసం కిందిస్థాయి ప్రజల పిల్లలకు తమ ఇంట్లో భోజనం పెట్టించి మరి విద్య నేర్పి ఉపాధ్యాయులు గా కీర్తి పొందారు.వీటన్నిటికీ మించి మానవకళ్యాణమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప మానవతవాదులు . ఇన్ని చేసిన వీరి సేవలకు నాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోను నేడు తెలంగాణ స్వంత రాష్ట్రం లోను అంతగా ప్రాచుర్యం పొందలేక పోయారు మహబూబాబాద్ జిల్లాల్లోని ఇనుగుర్ధి మండల కేంద్రంలో వారు నడయాడిన నేల న నేడు శిధిల వ్యవస్థలో వుంది ఎంతో సాంస్కృతిక పునర్జీవనం జరగాల్సి వున్నా నేడు పాలకులు వారిని పట్టించుకున్న పాపన న పోవడం లేదు నేటికీ వారి ఇల్లు వారు వాడినా వస్తువులు వారు పెట్టిన గవాక్షాలు చెక్కుచెదరకుండా వున్నా వారు నిర్మించిన ఇల్లు ఆలనాపాలనా కు నోచుకోక అవసాన దశకు చేరువైంది నేటి సమాజానికి వారు చేసిన కృషికి నిదర్శనం వారి నివాసం. పాలకులు కనువిప్పుచెంది నాటి గుర్తులను పదిలంగా నేటి సమాజానికి అందించి వారి సాంస్కృతిక పునర్జీవనం తిరిగి అందించాలని వారి జయంతి సాక్షిగా కోరుతూ.. (ఏప్రిల్ 2.సీతారామ రావు, ఏప్రిల్ 4 రాఘవ రంగ రావులు జయంతి).
-వీరంటీ ముఖేశ్, జర్నలిస్ట్,
మహబూబాబాద్ జిల్లా.
సెల్ : 9398236146




