మద్యం మత్తులో పాముతో యువకుడి సయ్యాట

కాటేయడంతో చికిత్స పొందుతూ మృతి
ముంబై,జూన్‌29: ‌మద్యం మత్తులో ఓ యు వకుడు.. విషపూరితమైన పాముతో చెలగాటం ఆడాడు. అది కాస్తా అతడి పురు షాంగంపై కాటు వేసింది. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ యువకుడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు.. పాముతో ఆడి ప్రాణాల దకు తెచ్చుకున్నాడు. అకస్మాత్తుగా ఆ పాము అతడి పురుషాంగంపై కాటు వేయడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మహారాష్ట్ర భివండీ జిల్లాలో జరిగిందీ ఘటన.

భివండీ జిల్లాలోని కొంబడపాడ ప్రాంతంలో శివ హటేకర్‌(21) అనే యువకుడు ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఆ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయానికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడ ఒక విషసర్పం అతడికి కనిపించింది.చూసి వదిలేయకుండా దానిని చేతితో పట్టుకున్నాడు. ఆ తర్వాత మద్యం మత్తులో పాముతో చెలగాటం ఆడాడు. అది అకస్మాత్తుగా అతడి పురుషాంగంపై కాటు వేసింది. దీంతో వెంటనే స్థానికులు అతడ్ని భివండీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడం వల్ల ముంబయి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *