మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 04; నూతన మధ్యం దుకాణాల రిజర్వేషన్లను జిల్లా పాలనాధికారి హరీష్ లక్కీడ్రా ద్వారా ఖరారు చేశారు. 2023-25 మద్యం విధానంపై గురువారం త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మహేశ్వరం అబ్కారీ సీఐ వీణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం అబ్కారీ సర్కిల్ పరిధిలో మొత్తం 13 మద్యం దుకాణాలు ఉండగా 4 దుకాణాలకు రిజర్వేషన్లు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. గౌడ కులానికి 3, ఎస్సీకి ఒక్కటి మద్యం దుకాణాలను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. గౌడ కులస్థులకు పెండ్యాలలో 85, 86 వ నంబరు దుకాణాలు, తుక్కుగూడ లో 78వ నంబర్ దుకాణాలు, ఎస్సీకి కందుకూరులో 88వ నంబరు మద్యం దుకాణం కేటాయించినట్లు తెలిపారు. మిగతా 9 దుకాణాలను జనరల్ విభాగానికి సంబంధించిన వారికి కేటాయించినట్లు తెలిపారు. శుక్రవారం గెజిట్ విడుదలైందని దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, 21న లాటరీ పద్ధతిలో కేటాయింపు ఉంటుందన్నారు. ఒక్క దరఖాస్తుకు రూ.2లక్షల డీడీ లేదా చలాన తీసి సంబంధిత స్టేషన్ వారికి ఎక్సైజ్ అకాడమీ, బండ్లగూడ జాగీర్ వద్ద సమర్పించాలని ఆమె కోరారు.


