మద్యం కేసులో కవితే అసలు సూత్రధారి

అవినీతి కేసుల్లో ఆడవారికి బెయిల్‌ ఇవ్వరాదు
అప్రూవర్‌కు బెదరింపులు..ఆధారాలు ధ్వంసం
కవితపై కోర్టులో ఈడీ వాదనలు
తీర్పును సోమవారానికి వాయిదా వేసిన  దిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు

న్యూదిల్లీ,ఏప్రిల్‌4:దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహార్‌  జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌజ్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటరుపై కవిత తరఫు న్యాయవాదులు రిజాయిండర్‌ దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత తరఫున మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఫ్వీు కోర్టులో వాదనలు వినిపించారు. బెయిల్‌ ఇస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. దిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారు. ఆమె తన ఫోన్‌ డేటాను డిలీట్‌ చేశారు. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. పది ఫోన్లు ఇచ్చినా అన్నీ ఫార్మాట్‌ చేసే ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను కవిత ఫార్మాట్‌ చేశారు. నిందితులు వందల డిజిటల్‌ డివైజ్‌లను ధ్వంసం చేశారు. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని బెదిరించారు.

ఆమె చిన్న కుమారుడు ఒంటరి కాదు. సోదరుడు, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారు.కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్‌ అడిగారు. కొన్ని పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి అని ఈడీ తెలిపింది. వాదనల అనంతరం రౌజ్‌ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఏప్రిల్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.  ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత అని ఆరోపించారు. కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఒక పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌పై ఒక పిటిషన్‌పై విదానలు వినిపిస్తున్నారు అభిషేక్‌ మను సింఘ్వి. బెయిల్‌ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఈడీ తన వాదనలు బలంగా వినిపించింది. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్‌ ఇవ్వకూడదని ఈడీ బలంగా వాదించింది. ఒకవేళ బెయిల్‌ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేసింది. కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్‌ స్కామ్‌ను ప్లాన్‌ చేసిందే కవిత అని ఆరోపించారు. ఫోన్‌ డేటా మొత్తాన్ని డిలీట్‌ చేశారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదన్నారు. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని ఆరోపించారు. అంతేకాదు.. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను ఈడీ తరపు న్యాయవాది జడ్జికి సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *