పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 11: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అలీ అబ్బాస్ జాతర మహోత్సవానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆశిర్ఖానాలో ఏర్పాటు చేసిన పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమ లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం అన్ని మతాల ప్రధాన పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి, నిరుపేదలకు బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు.పటాన్ చెరు నియోజకవర్గంలో సొంత నిధులతో గుడులు, మసీదులు, దర్గాలు, చర్చిలు నిర్మిస్తూ గంగా జమున తెహజీబ్ సంస్కృతిని నెలకొల్పుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుమ్మడిదల జెడ్పిటిసి కుమార్ గౌడ్, ఎంపీపీ ప్రవీణ విజయ్ భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




