ప్రధాని మోదీ, కిషన్‌రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం
ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : మణిపూర్‌లో హింసను అదుపు చేయడంలో విఫలమైన నేపథ్యంలో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోదీ, కిషన్‌రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మణిపూర్‌లో బాలికలపై ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడిన భయంకరమైన సంఘటనలు హృదయ విదారకంగా, దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. న్యాయం జరగాలని, మణిపూర్ సీఎం తక్షణమే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.


