—జడ్పీటీసీ దశరథ్ నాయక్, పిఎస్ సి ఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దామని జడ్పిటిసి దశరథ నాయక్, డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త అన్నారు. గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కడ్తాల పట్టణంలో సుమారు వెయ్యి మట్టి గణపతి విగ్రహాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత 9 సంవత్సరాల నుండి గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఏటా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మట్టి వినాయకులను పూజిద్దామని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, రైతు అధ్యక్షులు జోగు వీరయ్య, ఉపసర్పంచ్ రామకృష్ణ, ముద్విన్ కడ్తాల్ రైతు అధ్యక్షులు జంగయ్య, నర్సింహా, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి రామగుప్త, వీరేంద్ర గుప్తా, భద్రయ్య, పంతులు శ్రీధర్, శ్రీమన్నారాయణ, మూర్తి, వార్డ్ సభ్యులు రామచంద్రి, నాయకులు గణేష్, నర్సింహా, సాయి, రవి గుప్తా, వాసుదేవు గుప్తా, సతీష్, శ్రీకాంత్, మహేష్, అంజి, ఉపేందర్, సురేష్, సాయి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.




