సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: సిద్దిపేటలో బిజెపి, కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యిందివ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణకూట్లో రాయి తీయలేనోడు ఏట్లోని రాయి తీస్తడు అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం.కర్ణాటకలో మూడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారు.అక్కడి రైతులు, ప్రజలు ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వేశాం అని బాధపడుతున్నారు.కర్ణాటక ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రాగానే విద్యుత్ కోతలు విధిస్తున్నది కాంగ్రెస్ పార్టీది.అన్ని వర్గాల ప్రజల గురించి సీఎం కేసీఆర్ ఆలోచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు.తాగు, సాగు, కరెంట్ కష్టాలు తొలగించారు కేసీఆర్ధాన్యం ఉత్పత్తిలో నేడు తెలంగాణ దేశంలోనే టాప్అద్భుతమైన మేనిఫెస్టో బి ఆర్ ఎస్ విడుదల చేసిందిరైతు బీమా పథకం లాగా, అందరికీ 5 లక్షల బీమాను ప్రభుత్వం అందించబోతున్నది.సన్నబియ్యం ఇవ్వబోతున్నది. సౌభాగ్య లక్ష్మి ద్వారా 3వేలు ఇవ్వబోతున్నం.ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు. అభివృద్ధి మీ కంటి ముందే కనిపిస్తున్నది.బిఆర్ఎస్ పార్టీ గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని కోరుతున్నా.
బీజేపీ కి గుడ్ బై చెప్పిన రాష్ట్ర, జిల్లా నేతలు.మంత్రి హరీష్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన బీజేపీ నేతలు.కండువా కప్పి పార్టీ లో కి ఆహ్వానించి న మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం ఎల్లుపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ రెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, పుల్లూరు గ్రామానికి చెందిన ఉడుత మల్లేశం రాష్ట్ర ఓబీసీ జనరల్ సెక్రటరీ, బయ్యారం కమలాకర్ రెడ్డి బజరంగదళ్ జిల్లా అధ్యక్షులు, విజయ్ సిద్దిపేట మండల బీజేపీ సెక్రటరీ, మోత్కూ సాయి కుమార్, తీన్మర్ మల్లన్న టీమ్ జిల్లా కన్వీనర్, పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు స్వప్న, పురుమాండ్ల వెంకట్ రెడ్డి, అవినాష్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సామల్ల నరేందర్ రెడ్డి, తదితరులు మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ ఎస్ పార్టీ లో చేరారు.




