మంత్రి సురేశ్‌కు అస్వస్థత

అమరావతి, జూన్‌ 25 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ ‌పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ‌మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ప్రకాశం జిల్లా మర్కాపురంలోని తన కళాశాలలో ఉదయం వాకింగ్‌ ‌చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. సమాచారం అందుకున్న వ్యక్తిగత వైద్యులు హుటాహుటిన కళాశాలకు చేరుకుని మంత్రికి వైద్యపరీక్షలు నిర్వహించారు.

బీపీ కారణంగానే కిందపడినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం కళాశాలలోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. పదిరోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరగా మంత్రికి వైద్యులు స్టెంట్లు వేసి చికిత్స చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *