మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసారు. గురువారం ఉదయం లెనిన్ నగర్ కట్ట మైసమ్మ ఆలయం ముందు బిఅర్ఎస్ పార్టీ ప్రచార రథాలను సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి, తిరిగి వెళ్తుండగా బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద మంత్రి కాన్వాయ్ ని పోలీసులు అపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసులు కోరగానే మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాహనం దిగి తనిఖీకి పూర్తిగా సహకరించారు. పోలీసులు మంత్రి పర్సును కూడా తనిఖీ చేసారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు



