మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10(ఆర్‌ఎన్‌ఎ) : ‌మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం  కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 219లో హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

2018లో శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు పిటిషన్‌ ‌వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి..మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అందులో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పులను నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు తీర్పును వెలువరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *