మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14; తలసాని ని కలిసిన వర్గల్ యాదవ నేతలు అభినందనలు తెలిపిన శ్రీనివాస్ యాదవ్
సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రానికి చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘం నేత లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ స్థానిక జడ్పీటీసీ మామిండ్ల బాలమల్లు యాదవ్ ల నేతృత్వంలో సికింద్రాబాద్ లోని వారి నివాసం లో కలువగా మీ సిద్దిపేట జిల్లా నాయకత్వం చాలా చురుగ్గా పనిచేస్తున్నారన్నారు,వర్గల్ యాదవ సంఘం ఇంటింటికి తలా ఒకచేయి వేసి ఐకమత్యంతో వర్గల్ శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హల్ నిర్మించుకోవడం చాలా అభినందనీయమన్నారు.మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని వర్గల్ లో ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్న అన్ని విధాలుగా అండగా ఉండి సహకరిస్తానన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మామిండ్ల యాదయ్య యాదవ్, మామిండ్ల పుల్లయ్య యాదవ్, శ్రీశైలం యాదవ్ చీర్ల రఘువర్ధన్ యాదవ్, బిక్షపతి, మల్లేష్, స్వామి యాదవ్, జిల్లా నాయకులు కూచారం రవీందర్ యాదవ్, వనం మల్లేష్ యాదవ్, గొల్లరాజు యాదవ్,, ఎక్కలదేవి కనకరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *