ఉప్పల్, ప్రజాతంత్ర , నవంబర్ 13:సి ఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి చూచి, పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, మేసిఫెస్టోను చూసి ఆకర్షితులై నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నవీన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అర్ధిక , వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో , ఉప్పల్బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనయర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా హరీష్ రావు గజ్జల నవీన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.



