మంత్రి కేటీఆర్ తో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: జీహెచ్ఎంసి పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పై  ఎమ్మెల్యేలతో గురువారం హైదరాబాదులో రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఇళ్ల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. కొల్లూరు, ఉస్మాన్ నగర్ లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పటాన్ చెరు, పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అర్హులకు 10 శాతం ఇల్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో, రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందిస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *