హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కెటీ రామారావు తన ఎడమ కాలు మడిమకు గాయం అయిందనీ, డాక్టర్లు 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ట్వీట్ చేసారు. ఈ రోజు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన అనుచరులు, అభిమానులు వేడుకలకు సిద్ధమవుతున్నారు.
వర్షాల కారణంగా తాను వేడుకలకు దూరంగా ఉంటున్నాని…అభిమానులు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని శుక్రవారం కెటిఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.




