కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 14 : స్వచ్ఛ సర్వేక్షన్ 2023 రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డులో భాగంగా కందుకూరు మండలంలోని నేదునూరు గ్రామ పంచాయతీ రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా నుండి ఎంపిక చేయనైనది అట్టి కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ టి ఎస్ఐఆర్డి నందు అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగిందని ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర పంచాయతీశాఖ,మిషిన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ప్రిన్స్ పల్ సెక్రటరీ గ్రామీణ అభివృద్ధి శాఖ సందీప్ కుమార్ సుల్తానియా,గ్రామీణభివృద్ధి శాఖ డైరెక్టర్ హనుమంత్ రావు చేతులమీదుగా అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమంలో నేదునూరు గ్రామపంచాయతీ సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి నీలం రాఘవేందర్ కు అవార్డు అందజేయడం జరిగింది.ఇందులో జడ్పీసీఈఓ దిలీప్ కుమార్,డిఆర్డిఓ పిడి ప్రభాకర్,ఎంపీడీవో ఎన్.వెంకట్ రాములు ఎంపిఓపి కళ్యాణి, ఎపిఓ రవీందర్ రెడ్డి,టిఎ రవికుమార్ పాల్గొన్నారు.




