- సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉదయనిధి మాట్లాడడం తగదు
- ఉదయనిధికి వచ్చే జన్మలో కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదంటూ ఘూటు విమర్శలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 5 : తమిళనాడు మంత్రి ఉదయనిధి పై విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కామెంట్స్ చేసారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉదయనిధి సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు. ఉదయనిది తల్లి దుర్గా స్టాలిన్ దేవాలయాల చుట్టూ తిరుగుతారని తల్లిని కించపరిచేలా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉదయానిధికి వచ్చే జన్మలో కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదని స్వరూపానంద ఘాటుగా విమర్శించారు. దేశవ్యాప్తంగా అందరూ ఉదయనిది వైఖరిని ఖండించాలని కోరారు.




