భార్యను హతమార్చిన డాక్టర్‌

ఉత్తర్‌‌ప్రదేశ్‌లో వెలుగుచూసిన ఘటన
లఖింపుర్‌ఖేరీ, డిసెంబర్‌ 13 : ఓ ‌వైద్యుడు తన తండ్రితో కలిసి భార్యను హతమార్చాడు. అత్తవారు పెళ్లికి కట్నంగా ఇచ్చిన పెట్టెలోనే భార్య మృతదేహాన్ని పెట్టి దూరంగా తీసుకెళ్లి దహనం చేశాడు. ఈ దారుణం ఉత్తర్‌‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. లఖింపుర్‌ ‌ఖేరీలో దారుణం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పెట్టెలో పెట్టి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న గఢ్‌ముక్తేశ్వర్‌కు తీసుకెళ్లి దహనం చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తన భార్య కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 20 రోజుల కిందట జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు, అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు.

రాయ్‌పుర్‌ ‌గ్రామానికి చెందిన వందనా శుక్లా (28)కు అభిషేక్‌ ‌దీక్షిత్‌ అనే వైద్యుడితో 2014లో వివాహం జరిగింది. వందనా శుక్లా కూడా డాక్టరే. దంపలిద్దరూ సీతాపుర్‌?‌లో ఓ ఆస్పత్రిని నిర్మించుకుని అక్కడే ప్రాక్టీస్‌ ‌చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా భార్యాభర్తలు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత వందన.. చమల్‌పుర్‌లోని లక్ష్మీ నారాయణ్‌ ‌హాస్పిటల్‌లో ప్రాక్టీస్‌ ‌చేయడం ప్రారంభించింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు అభిషేక్‌, అతడి తండ్రి గౌరీ శంకర్‌.. ‌నవంబరు 26న వందనపై కర్రలతో దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత ఇద్దరూ వందన మృతదేహాన్ని పెట్టెలో పెట్టి గౌరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉదయం అంబులెన్స్‌ను అద్దెకు తీసుకుని వందన మృతదేహాన్ని గఢ్‌ముక్తేశ్వర్‌కు తీసుకెళ్లి దహనం చేశారు.

ఈ క్రమంలో నవంబరు 27న మృతురాలి తండ్రి శివరాజ్‌? ‌శుక్లా.. తన కూతురు కనిపించట్లేదని అల్లుడు అభిషేక్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫోన్‌కాల్‌ ‌డేటా పరిశీలించారు. మృతదేహాన్ని తరలించిన అంబులెన్స్ ‌డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతడి వాంగ్మూలం ఆధారంగా అసలు విషయం బయటపడింది. వందన మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించేటప్పుడు ఆమె తలనుంచి రక్తం కారుతోంది. ఇది చూసిన అంబులెన్స్ ‌డ్రైవర్‌.. ‌నిందితుడు అభిషేక్‌ను ప్రశ్నించాడు. అయితే, డ్రైవర్‌కు అభిషేక్‌ ఏదో కథ చెప్పాడు. తన భార్య స్కూటీపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి మరణించిందని కథ అల్లాడు. పోస్టుమార్టం ఇష్టంలేక ఇలా సీక్రెట్‌గా మృతదేహాన్ని తరలిస్తున్నామని తెలిపాడు. పోలీసులు అంబులెన్స్ ‌డ్రైవర్‌ను విచారించగా అతడు ఈ విషయాన్ని బయటపెట్టాడు.
దీంతో నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *