భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం

ఎప్పుడూ పడనంతగా భారీ వర్షంతోనే తీవ్రనష్టం
ములుగు జిల్లా కొండాయి గ్రామ వరదల్లో 8 మంది మృతి…అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి
మోరంచలో ఎమ్మెల్యే పర్యటన…బాధితులకు ఆదుకుంటామని హావి•
నిజామాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు….శ్రీరాంసాగర్‌లో 32 గేట్లు ఎత్తి నీటి విడుదల
నిండుకుండల్లా జంట జలాశయాలు

ఫోటో:మేడారం జంపన్నవాగులో గల్లంతైన మృతదేహం

మున్నేరులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు వొచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌…అభినందించిన మంత్రి పువ్వాడ
రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు రోజులుగా కురుస్త్ను భారీ వర్షాలకు జనజీవనం స్థంభిచిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పలు ప్రాంతాల్లో మనుషులు గల్లంతయ్యారు. శుక్రవారం వర్షం కొంత తెరిపినివ్వడంతో ఇప్పటి వరకు జలదిగ్బంధంలో చిక్కుకుని మునిగిపోయిన ఇండ్లు తేలాయి. పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకునిపోయాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఇతర శాఖల సహాయ సహకారాలతో ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఇక సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రత్యేక హెలికాప్టర్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకుని రావడంతో పాటు వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలో జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొండాయి, మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వరదలో కొట్టుకుపోయి గుర్తుతెలియని యాచకుడి మృత దేహం కరెంటు తీగలకు వేలాడుతూ కనిపించింది. జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్థంభిచిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కాగా, ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో గురువారం వరదలో గల్లంతైన ఎనిమిది మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం గల్లంతైన వ్యక్తులలో నాలుగు మృతదేహాలు లభించగా మధ్యాహ్నం వరకు మరో నాలుగు మృతదేహాలు లభించినట్లు సమాచారం. దీంతో గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లాలో తొమ్మిది మంది వ్యక్తులు వరదల కారణంగా మృతి చెందారు. వర్షం కొంత తెరిపి నివ్వడంతో జలదిగ్భందంలో చిక్కుకుని మునిగిపోయిన ఇండ్లు తేలాయి. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదిలావుంటే రాష్ట్రంలో ములుగు జిల్లాలో పడినంత వర్షం చరిత్రలో ఎప్పుడు చూడలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అం‌డ్‌బీ గెస్ట్ ‌హౌస్‌లో ములుగు జిల్లా ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి యస్‌. ‌కృష్ణాదిత్య, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి గౌతమ్‌ ‌పొట్రూ, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి వి•డియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 70 సెంటీవి•టర్లు పైగా భారీ వర్షపాతం నమోదు కావడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. భారీ వర్షాల వల్ల ఇప్పటివరకు జిల్లాలో 8 మంది మృత్యు వాతపడ్డారని వివరించారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, అన్ని విధాలుగా నష్టపోయిన వారికి రూ. 25 వేలు తక్షణమే అందిస్తామని అన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ‌కోటి రూపాయలను మంజూరు చేశారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *