భారీ ర్యాలీతో తెలంగాణ భవన్ కు సింగిరెడ్డి శిరీష, సోమశేఖర్ రెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27:  సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తెలంగాణ భవన్ కు బయలుదేరి వెళుతున్నాననీ
టిపిసిసి మాజీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆయన సతీమణి డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డితో కలిసి  కుషాయిగూడ నుండి పదివేల మంది అనుచరులతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు బయలుదేరి వెళుతున్నాననీ ఆయన తెలిపారు.  బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నని ప్రకటించిన తర్వాత ఉప్పల్ నియోజకవర్గం ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.  కాంగ్రెస్ పార్టీలో తమ వెంట సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తమ వెంట వస్తున్నారన్నారు.  నవంబర్లో జరగనున్న శాసనసభ ఎన్నికలలో స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని గెలిపించడం మే కాకుండా, అధిష్టానం నిర్ణయం మేరకు రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడైనా తాను ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.  అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఓడగొట్టేందుకు ఆర్ బి ఎస్ (రేవంత్ రెడ్డి బాధితుల సంఘం) ను ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ని ఓడిస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *