ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : భారతీయ జనతా పార్టీ కడ్తాల్ మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి ముఖ్య నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ కడ్తాల్ నుండి హైదరాబాద్ – శ్రీశైలం రహదారి మీదుగా ఆమనగల్లు, వెల్దండ మీదుగా కల్వకుర్తి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక నార్త్ మంగళూరు అసెంబ్లీ ఎమ్మెల్యే డాక్టర్ వై. భరత్ శెట్టి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి తో కలిసి ప్రారంభించారు. కల్వకుర్తి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే సంపర్క్ అభియాన కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్ బ్రహ్మచారి, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలాల్ నాయక్, మండల అధ్యక్షుడు మన్యా నాయక్, మరియు వివిధ మోర్చాల రాష్ట్ర, జిల్లా నాయకులు మండల మోర్చా అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జులు బూత్ అధ్యక్షులు వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.




