భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

విపక్ష అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాపై ఘన విజయం

న్యూ దిల్లీ, జూలై 21 : భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము 63 శాతం వోట్లతో ఘన విజయం సాధించారు. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించారు.

సగానికి పైగా వోట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ద్రౌపది ముర్ముకు బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతోపాటు బీజేడీ, వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌సహా 44 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆమె ఎలక్టోరల్‌ ‌కాలేజ్‌లో అవసరమైన మెజార్టీకి మించి వోట్లు సాధించారు. 25న దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *