భారతీయ గురుకుల విద్య ప్రపంచానికి ఆదర్శం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 24 : ‌భారత గురుకుల విద్యా సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2014 తర్వాత వైద్య కాలేజీల సంఖ్య 65శాతానికి పైగా పెరిగిందన్నారు. కొత్త జాతీయ విద్యావిధానం ద్వారా.. మెరుగైన విద్య అందుతుందని చెప్పారు. శ్రీ స్వామినారాయణ గురుకుల్‌ ‌రాజ్‌ ‌కోట్‌ ‌సంస్థాన్‌ 75‌వ అమృత్‌ ‌మహోత్సవంలో.. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మోడీ ప్రసంగించారు. స్వామినారాయణ గురుకుల్‌ ‌సంస్థ భవిష్యత్‌ ‌మరింత ఉజ్వలంగా ఉండాలని ఆశిస్తున్నానన్నారు. ఇస్రో నుండి షార్క్ ‌వరకు గురుకులాలకు చెందిన వారసత్వమే ఉందని ప్రధాని మోడీ అన్నారు. వీరు దేశం యొక్క ప్రతిభను శక్తివంతం చేశారన్నారు. పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నందుకు గురుకులంపై మోడీ ప్రశంసలు కురిపించారు.

పేద విద్యార్థుల విద్యను పూర్తి చేయడానికి గురుకులం రోజుకు ఒక రూపాయి వసూలు చేస్తుందని అన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు చదువుకో గలుగుతున్నారని చెప్పారు. నలంద, తక్షశిల వంటి పురాతన విశ్వవిద్యాలయాల వారసత్వాన్ని మోడీ గుర్తుచేశారు. ప్రాచీన కాలం నాటి గురుకులాల వైభవం, మహిమ, వైభవానికి ఈ సంస్థలు ఉదాహరణలు అని అన్నారు. గార్గి, మైత్రేయి వంటి మహిళా సాధువులు చేసిన సేవలను కూడా ఆయన గుర్తు చేసుకుంటూ, ’లింగ సమానత్వం వంటి పదాలు పుట్టకపోయినప్పటికీ, గార్గి , మైత్రేయి వంటి మన సాధువులు శాస్త్రాలను అధ్యయనం చేసేవారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *