భవిష్యత్తు భారత ఇంధన వనరు-గ్రీన్‌ ‌హైడ్రోజన్‌

పెట్రోల్‌, ‌డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించిన కేంద్రం ఇటీవల ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.నేషనల్‌ ‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌మిషన్‌’ ‌కోసం రూ. 19,744 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
2030 నాటికి 125 గిగా వాట్స్ ‌పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్‌ ‌లక్ష్యం. ఏడాదికి 5 మిలియన్‌ ‌మెట్రిక్‌ ‌టన్నుల గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కార్బన్‌ ‌రహిత ఇంధన వనరు
ఈ మిషన్‌ ‌ద్వారా ఉత్పత్తి చేసే ‘కార్బన్‌ ‌రహిత హైడ్రోజన్‌’‌ను ఆటోమొబైల్‌ ‌వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. చమురు శుద్ధి కర్మాగారాలు, ఉక్కు కర్మాగారాలు లాంటి పరిశ్రమల్లోనూ ఇది ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది.

అద్భుతమైన శక్తి వనరు హైడ్రోజన్‌
‌హైడ్రోజన్‌లో అద్భుతమైన శక్తి ఉంటుంది. అంతే కాదు విశ్వంలో ఇది పుష్కలంగా లభిస్తుంది. కానీ భూమిపై మాత్రం ఇది సంక్లిష్టమైన మాలిక్యూల్స్ అం‌టే నీళ్లు లేదా హైడ్రో కార్బన్స్ ‌రూపంలో కనిపిస్తుంది. హైడ్రోజన్‌ ‌శిలాజ ఇంధనాలు లేదా సౌరశక్తి, గాలి వంటి పునర్వినియోగ ఇంధన వనరు వంటిది కాదు. అంటే దాన్ని ఉత్పత్తి అయినా చేయాలి లేదా వెలికి తీయాలి. అలా చేసిన దాన్ని ఉపయోగించడానికి ముందు నిల్వ చేయాలి.

పర్యావరణ హితమైన గ్రీన్‌ ‌హైడ్రోజన్‌
‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ అనేది గ్యాస్‌ ‌ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే పరిశుభ్రమైన విధానం. పర్యావరణానికి మేలు చేసే ఇంధనంగా దీన్ని నిపుణులు పరిగణిస్తున్నారు. గ్రీన్‌ ‌హైడ్రోజన్‌తో నడిచే కారులో ప్రయాణించేందుకు తాను ప్రయత్నిస్తానని ఈ మధ్యే కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ ప్రకటించారు. విషవాయువులు వెదజల్లే వాహనాలు ఉపయోగించకుండా ప్రయాణాలు చేయడం సాధ్యమేనని చూపదలిచానని ఆయన అన్నారు.

గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌గురించి ఆలోచన
ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాలకు సంబంధించి కఠినమైన ప్రమాణాలు, ఈయూ దేశాలకు ఎగుమతి చేసే వస్తువుల పై గ్రీన్‌ ‌ట్యాక్స్ ‌వంటి నియమాలు భారతదేశాన్ని ప్రేరేపించాయి. దీంతో గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌గురించి తీవ్రమైన ఆలోచనలు మొదల య్యయి.హైడ్రోజన్‌ను తయారు చేయడానికి ఉపయోగించే విద్యుత్తు పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వస్తుంది. కనుక ఇది కాలుష్యాన్ని కలిగించదు. అందుకే దీనిని గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ అం‌టారు.

చమురు శుద్ధి, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌ ‌వంటి భారీ పరిశ్రమలను డీకార్బనైజ్‌ ‌చేయడానికి ఇది సహాయ పడుతుంది. ప్రపంచ కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడంలోనూ ఇది సహాయకారిగా ఉంటుంది. హైడ్రోజన్‌ను ఫ్యూయల్‌ ‌సెల్‌గా ఉపయోగించినా లేదా ఉష్ణాన్ని సృష్టించేందుకు మండించినా, లేదా శిలాజ ఇంధనాల స్థానంలో హైడ్రోజన్‌ ఉపయోగించినా అది గ్లోబల్‌ ‌వార్మింగ్‌ను తగ్గిస్తుంది.
డీ కార్బనైజింగ్‌ ఏజెంట్‌

సులభంగా రవాణా చేయగలగడంతో పాటు రసాయనాలు, ఇనుము, ఉక్కు, ఎరువులు, రీఫైనింగ్‌, ‌రవాణా, ఉష్ణ, విద్యుత్‌ ‌పరిశ్రమల్లో డీకార్బనైజింగ్‌ ఏజెంట్‌గా ఉండటం దీనికున్న అదనపు ప్రయోజనం.రసాయన ప్రక్రియలో నీటిని విభజించడం ద్వారా గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. సూర్యుని లాంటి పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఉపయోగించి విద్యుద్విశ్లేషణ ద్వారా నీటిని విభజించినప్పుడు ‘గ్రీన్‌ ‌హైడ్రోజన్‌’ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా ‘ఆక్సిజన్‌’ ‌వస్తుంది. గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ను తయారు చేయడానికి నీరు, తక్కువ విద్యుత్‌ అవసరం.భారత్‌లో ఈ రెండు వనరులు ఉన్నాయి. ఇండియాకు చాలా పొడవైన తీర ప్రాంతం ఉంది. సూర్యరశ్మి కూడా పుష్కలంగా ఉంది. సౌర విద్యుత్‌, ‌సముద్రపు నీరు గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ను తయారు చేయడంలో సహాయకారిగా ఉంటాయి.

ఖర్చు ఎక్కువ
గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ఉత్పత్తికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరిచేందుకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అయినప్పటికీ తరిగిపోతున్న పునర్‌ ఉత్పాదక వనరులు, పడిపోతున్న ఫ్యూయల్‌ ‌సెల్‌ ‌ధరలు, కఠినమైన వాతావరణ మార్పు అవసరాల రీత్యా ఇందులో పెట్టుబడులు వేగం పుంజుకున్నాయి.భవిష్యత్తులో గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌తయారీ రంగంలో భారత్‌ ‌ముందంజలో వేసి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిద్దాం.

– పిన్నింటి బాలాజీ రావు,  భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు  హనుమకొండ.9866776286

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *