భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల కోసం

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకోవద్దు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి
అన్ని పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణి
మంత్రి చొరవతో ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు
జడ్పిచైర్మెన్ తీగల అనితారెడ్డి.

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 23 : ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకోకుండా పిల్లల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికోసం పెట్టుబడులుగా మార్చి భావితరాలకు ఆదర్శవంతంగా నిలవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ సబితా ఇంద్రారెడ్డి సూచించారు.శనివారం కందుకూరు మండల కేంద్రంలో రెండు కోట్ల 67 లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్లు,ఓపెన్ జిమ్, మార్కెట్ యార్డు ప్రారంభోత్సవాలు చేశారు. కందుకూరు గ్రామం నుండి ఫార్మాసిటీ రోడ్డు వరకు బిటీ రోడ్డు నిర్మాణం కోసం మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం మండల కేంద్రంలో మొల్లమాంబ విగ్రహావిష్కరణ చేశారు.అనంతరం టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో పేదలకు 300 మంది పేదలకు పట్టా సర్టిఫికెట్లను మంత్రి సబితా రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి,కందుకూరు,కొత్తగూడ  సర్పంచులు శమంతకమణి,మల్లారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు,జడ్పిటిసి  బొక్క జంగారెడ్డిలతో  కలసి లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ ఇళ్ల స్థలాలను అర్హులైన వారికి ఇవ్వాలని కెసిఆర్ ఆదేశించడంతో కందుకూరు మండల కేంద్రంలో 788 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో 300 మంది లబ్ధిదారులకు 70 గజాల చొప్పున ఇంటి స్థలాల సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.మిగతా అర్హులైన వారికి వెంటనే ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.రాజకీయాల కతీతంగా కుల మత తారతమ్యం లేకుండా అర్హులైన పేదలకు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.కందుకూరు ప్రాంతంలో ప్రభుత్వ భూములకు సైతం విపరీతమైన డిమాండ్ ఉందని 70 గజాల ఇంటి స్థలాల ఖరీదు సుమారుగా 10 లక్షల విలువ ఉంటుందని మంత్రి తెలిపారు.కందుకూరు మండల కేంద్రంలో చాలామంది పేదలు రోడ్డుపై కూర్చొని కూరగాయల విక్రయిస్తుంటే తనకు కొన్ని సందర్భాల్లో బాధ ఉండేదని వారిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ పక్కన నూతనంగా మార్కెట్లో నిర్మించి కూరగాయలు అమ్ముకునేందుకు అవకాశం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదే  అన్నారు.ప్రతిరోజు మార్కెట్లో కూరగాయలు విక్రయించుకుని మంచి లాభాలు సంపాదించుకోవాలని మంత్రి వారికి సూచించారు.తెలంగాణ ప్రభుత్వంలో వృద్ధులకు,ఒంటరి మహిళలకు 3వేలు దివ్యాంగులకు చేయూతనిచ్చి నాలుగు వేలు చొప్పున పింఛన్లు అందజేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వాందేనన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్టుదలతో ఉండి అనుకున్నది సాధించేంతవరకు పోరాటం సలుపుతాడని ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడని మంత్రి కొనియాడారు.కందుకూరు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ ఎయిర్పోర్ట్ నుండి తుక్కుగూడ,తుక్కుగూడ నుండి ముచ్చర్ల వరకు మెట్రో రైలు వచ్చే విధంగా గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చినట్లు మంత్రి సబితా రెడ్డి తెలిపారు.దానితోపాటు 170 కోట్లతో 30 ఎకరాల భూమిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం అక్టోబర్ ఒకటవ తేదిన శంకుస్థాపన చేసుకోబోతున్నామని మంత్రి తెలియజేశారు.తమ తమ పిల్లలను లాయర్లుగా తీర్చి దిద్దేందుకు అణువుగా కందుకూరుకి లా కాలేజ్ మంజూరు చేసిన ఘనత కేసీఆర్ దే  అన్నారు.గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం నుండి లా కాలేజీ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని పార్టీలకు అతీతంగా పట్టాల కార్యక్రమం జరుగుతుందని,మంత్రి చొరవతో ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.ఇందులో రాజకీయాలు చేయడం సబబు కాదని ఆమె హితవు పలికారు. ఇలాంటి కార్యక్రమాల్లో కేసీఆర్ కోసం ఎంత చెప్పినా తక్కువేనని,సీఎం ఆలోచనతో పేదలు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో దళితుల కోసం దళిత బంధు,బీసీల కోసం బీసీ రుణాలు,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ తదితర మహత్తర కార్యక్రమాలను చేపట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కులమతాలకు తావు లేకుండా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంటే కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురసాని వరలక్ష్మి,వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి,ఎంపీటీసీ సురసాని రాజశేఖర్ రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సామ ప్రకాష్ రెడ్డి,కొత్తగూడ మాజీ సర్పంచ్ రాయిచెట్టు యాదయ్య, ఆర్డీవో సూరజ్ కుమార్,తహసిల్దార్ గోపాల్, ఎంపీడీవో వెంకట్రాములు,టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మన్నే జయేందర్, ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *