భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 24 :  గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి దోబూచులాడుతుంది. పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఆదివారం నాడు 44 అడుగులకు మళ్ళీ పెరిగిన గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 35 అడుగులకు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న డ్యాములు వాటి సామర్థ్యాన్ని మించి నీరు ఉండటంతో క్రింది భాగానికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

దీని కారణంగా గోదావరి నీటిమట్టం మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం క్రింది స్థాయి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ‌ప్రియాంక అలా ఆదేశించారు. ఇప్పటికే భారీ వర్షాలకు భద్రాచలం డివిజన్‌ అతలాకుతులమవుతుంది. డివిజన్లోని మారుమూల గ్రామాలు ఎండలోకి వర్షపు నీరు చేరుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో రహదారుల సౌకర్యం కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. భద్రాచల పట్టణంలో ఏఎంసీ కాలనీ కొత్త కాలనీలో వాట్సాప్‌ ‌నేరు ఇండ్లలోకి చేరుకుంటుంది. గోదావరి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *