భగవత్ గీత పారాయణం ర్యాలీని ప్రారంభించిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 24: భగవత్ గీత పారాయణం ఏడు రోజుల కార్యక్రమం పురస్కరించుకొని రాజస్థానీ మార్వాడి కమ్యూనిటీ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ , జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ సెక్రటరీ కక్కిరేణి చేతన హరీష్, అలయ కమిటీ చైర్మన్ కక్కిరేణి హరీష్ లు విచ్చేసి ర్యాలీ నీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఊర పోచమ్మ దేవాలయం గోఖలే నగర్ నుండి పూనమ్ భవన్ నెహ్రూ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు వారం రోజులు సామూహిక భగవత్ గీత పారాయణం చేయడం జరుగుతుందనీ తెలిపారు. కార్య క్రమంలో భక్తులందరూ పాల్గొన్ని గీతా పారాయణం చేయాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో మార్వాడీ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *