ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఆమనగల్లు మున్సిపాలిటీ లోని ఆరో వార్డు సాయి నగర్ కాలనీలో సాయి నగర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడికి ఆమనగల్ బిజెపి మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్, బిఆర్ఎస్ నాయకుడు ఉప్పల రాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాధుడికి సర్వాంగ సుందరంగా మండపాలను అలంకరించి విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో భక్తులతో వినాయక మండపాలు కిటకిటలాడుతున్నాయి భక్తులు పూజల కోసం ఆయా మండపాల వద్ద బారులు తీరుతున్నారు. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బాలు నవీన్ శివ చందు ఆంజనేయులు వెంకటయ్య రవి రఫీ తదితరులు పాల్గొన్నారు.



