ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 23 : తలకొండపల్లి మండలంలోని పాతకోట గ్రామపంచాయతీలో ఘనంగా మొలకల పండుగ ను గిరిజనులు ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని గిరిజనతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పాతకోట గ్రామపంచాయతీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంచి వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలననీ పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అలివేలు జీరా నాయక్, ఉప సర్పంచ్ పద్మ గురు సింగ్, వార్డ్ మెంబర్లు శ్రీను, పాండు, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గోపి నాయక్, గ్రామ ప్రజలు, నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.


