‌బ్రహ్మోత్సవాల్లో గద్వాల పంచెలు

ఏటా ఆనవాయితీగా సమర్పిస్తున్న నేతన్నలు
శ్రీ‌వేంకటేశ్వర స్వా వార్లకు మొదటి రోజు కట్టే పంచెలను చేనేత కార్మికులు సమర్పిస్తారు. నెల రోజులపాటు నియమనిష్టలతో నేసిన పంచెల్ని వేంకటేశ్వర స్వా వార్లకు కట్టించే సాంప్రదాయాన్ని గద్వాల రాజులు 350 ఏళ్ల క్రితం కొనసాగిస్తే, వారి వారసులు నేటీకి గద్వాల చేనేత కార్మికులతో పంచెలు నేయించి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానమునకు సమర్పిసున్నారు. ఈ పంచెల్ని కట్టిన తర్వాత అర్చకులు స్వామి చెవిలో మూడు సార్లు ’ గద్వాల ఏరువాడ జోడు పంచెలు వచ్చాయి ’ అని చెపుతారు, ఆ తరువాత స్వామికి గద్వాల సంస్థానము వారితో హారతి ఇప్పించడము ఒక సాంప్రదాయముగా వస్తున్నది.

నడిగడ్డగా పిలిచే గద్వాల ప్రాంతము కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యలో ఉండటము వలన ఏరువాడగా, రెండు పంచెలు కాబట్టి జోడు అనే పదము వచ్చినదని చేనేత కార్మికులు చెప్పుతారు. వీటిని నేయడానికి నాణ్యమైన పట్టును, మిగితా భాగము నూలును వాడతారు . దీనికి అనుగుణముగా పంచేల అంచులకు ఎక్కువ భాగం ఎరుపు, ఆ పైన ఆకుపచ్చ , బంగారు వర్ణముల పట్టు వాడతారు. ఈ పంచెలు ఒక్కొకటి పది టర్ల పొడవు, రెండున్నర టర్ల వెడల్పుతో నేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *