బ్రష్టాచార్ రాష్ట్ర సమితిని గద్దె దింపాలి

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: రాష్ట్రంలో బ్రష్టచార్ రాష్ట్ర సమితి గద్దె దింపాలని బిజెపి బళ్లారి ఎమ్మెల్సీ సతీష్ యాచి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ తాండూర్ పట్టణ అధ్యక్షులు గొర్రెపల్లి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రవాస్ యోజనలో భాగంగా  ఎంపిటి ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బళ్లారి ఎమ్మెల్సీ సతీష్ యాచిరెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహూ శ్రీలత నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి కన్వీనర్ రజనీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో గత తొమ్మిది సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని , గ్రూపు రాజకీయాలతో తాండూర్ ప్రజలు విసిగి పోయారని అన్నారు. అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకుల అరాచకాన్ని సృష్టిస్తున్న తీరుని తాండూర్ నిశ్చితంగా గమనిస్తున్నారని, తాండూర్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. తాండూరు పట్టణంలో  జాతీయ రహదారి అత్యాధునిక హంగులతోరైల్వే స్టేషన్ అభివృద్ధి,  నర్సింగ్ కళాశాల ఐటిఐ కళాశాల పాత తాండూర్ కు ఆర్ఓబి మంజూరు ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు గత మూడున్నర సంవత్సరాలుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా ఐదు కిలోల బియ్యం కస్తూర్బా పాఠశాలలు 50 శాతం సబ్సిడీతో రైతులకు ట్రాక్టర్లు ఇలా అనేక సంక్షేమ పథకాలతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే బిఆర్ఎస్ పార్టీ అవినీతిలో ముందుకెళ్తుందని వారు ఎద్దేవా చేశారు.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేసే బాధ్యత మనందరిపై ఉందని ముఖ్యంగా భూత్ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో సమిష్టిగా  కృషి చేస్తే భారతీయ జనతా పార్టీ జెండా తాండూర్ లో ఎగరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్ణాటక రాష్ట్రం బళ్ళారి ఎమ్మెల్సీ సతీష్ గారు, జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు బాలప్ప శ్రీలత అంతారం లలిత జిల్లా కార్యదర్శి భద్రేశ్వర్ పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ , శ్రీహరి, పట్టణ ఉపాధ్యక్షులు రాజు నరేందర్ దశరథ మోడీ కార్యదర్శిలు ప్రకాష్ సంగమేశ్వర్ శివాజీ ఠాకూర్ బీజేవైఎం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రహ్లాద రావు మైనార్టీ మార్చా అధ్యక్షులు జహీర్ అబ్బాస్ బీజేవైఎం నాయకులు కిరణ్ నరేష్ సతీష్ బిజెపి నాయకులు పాండు పూజారి మోత్కుపల్లి శేఖర్ గాజుల శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *