ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 : కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఏటా శ్రావణమాసంలో జరిగే బోనాల పండుగను వైభవంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. బోనాల వేడుకలను పురస్కరించుకొని బుధవారం పోచమ్మ ఉత్సవ కమిటీ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో నాలుగు రోజుల పాటు జరిగే బోనాల పండుగ ఆహ్వాన పత్రికను పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈనెల 9న కాటమయ్య బోనాలు, 10వ తేదీన బీరప్ప, పెద్దమ్మ, మైసమ్మ, మడేలు స్వామి, ఈదమ్మ బోనాలు, 11 న గ్రామ దేవత పోచమ్మ బోనాలు మరియు ఉదయం 5 గంటలకు అభిషేకం, 12న ఎల్లమ్మ తల్లి బోనాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ ఏ సత్యం యాదవ్, సభ్యులు మల్లేష్ గౌడ్, కార్తీక్, రామచంద్రనాయక్, మాజీ సర్పంచ్ బిచ్చ నాయక్, వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి, యాదయ్య గౌడ్, యాదగిరిరెడ్డి, పాండు యాదవ్, శేఖర్ రెడ్డి, నరసింహ, శ్రీశైలం, శంకరయ్య, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.




