బోటింగ్ తో ఆహ్లాదం ఆనందం లభిస్తుంది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరి కొండలతో పాటు కోట్ పల్లి రిజర్వాయర్ పర్యాటకులకు కనువిందు చేస్తూ ఆహ్లాదకర వాతావరణం కల్పించడం జరుగుతుందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గం కోట్ పల్లి ప్రాజెక్టులో జీకే ఎం ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్డిఓ విజయకుమారిలతో కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎకో టూరిజం బోటింగ్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ బోటింగ్తో ఆహ్లాదకర వాతావరణం తో పాటు ఆనందం లభిస్తుందని తెలిపారు. వికారాబాద్ అనంతగిరి కొండలతో పాటు కోటిపల్లి రిజర్వాయర్ ను కూడా పర్యాటకంగా అభివృద్ధిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. బోటింగ్ తో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *