అమర్‌రాజా తెలంగాణకు పోవడమే నిదర్శనం:ధూళిపాళ్ల
గుంటూరు: ఎపిలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే వారు జగన్ బినాలైనా అయివుండాలి, లేకపోతే ఆయన వర్గానికి వాటాలైనా ఇవ్వాల్సి ఉందని, ఈ రెండూ కాదంటే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారి పోవాల్సిం దేననిని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. శనివార ఆయన డియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపులు, వైసిపి నేతల వసూళ్లు తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారన్నారు. రాష్ట్రంలో క్యాపిటల్ ఇన్లోకు బదులుగా రివర్స్ప్లో జరుగుతుండటం బాధాకరం. ఎఫ్‌డీఐల ఆకర్షణలో 14వ స్థానానికి పడిపోవడం సిగ్గుచేటు. ఉన్న పరిశ్రమలను బెదిరించి తమ వారికి కట్టబెట్టుకుంటున్నారు. కాకినాడ సెజ్, గంగవరం పోర్టు వంటివే ఇందుకు ఉదాహరణలు అన్నారు. ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకునే వాళ్లని బెదిరించటం లేదా వారి వ్యాపారాన్ని లాక్కోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. టెక్స్టైల్స్, ఆహార ఇతర రంగాలకు ఇవ్వాల్సిన రూ. 6వేల కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.
టిడిపి హయాంలో పారిశ్రామిక రంగంలో గుజరాత్‌తో పోటీపడిన ఏపీ..అయితే నేడు దేశంలో 14వ స్థానానికి దిగజారిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. అమర్ రాజా సంస్థ తెలంగాణ రాష్టాన్రికి వెళ్లిపోవడంపై ఆయన స్పందించారు. సీఎం జగన్ జే ట్యాక్స్, వైసీపీ నేతల వేధింపులతో పారిశ్రామికవేత్తలు ఫలాయనం చిత్తగిస్తున్నారని, ఈ విషయాన్ని పారిశ్రామికవేత్తలే బహిరంగంగా చెబుతున్నారని తెలిపారు. కాకినాడ సీ పోర్ట్, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్ట్ వాటాలు.. జగన్ బినా అరబిందో సంస్థకు ఎలా దక్కాయి? ట్రాన్స్ఫార్మర్లు తయారుచేసే షిర్డీసాయి ఎలక్టిక్రల్స్కు సోలార్ టెండర్లు కట్టబెడితే, రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. తన సంస్థలు, తన బినా కంపెనీలు తప్ప, ఇతర సంస్థలు ఏపీలో ఉండకూడదన్నదే జగన్ ధ్యేయమని పేర్కొన్నారు.




