అనుభూతులు కరిగినప్పుడే
ఆనందం  ఊటలా ఉబికోస్తుందీ
ఉవ్వెత్తున ఎగిసిపడే అలల
కెరటాల అనురాగాలు
ఆత్మీయ సమ్మేళనం లో
అయస్కాంత క్షేత్రలవుతాయి
పిలువకుండానే వొచ్చిన
అతిధి లా.. తోటి మనిషి
ఆపదాలలో గోపిక బాలుడై
కష్టల గొల్ల భామలను మురిపిస్తే
ఆ అభిమానం బృందావనమవుతుంది
ప్రేమ రాధాలా పరోపకారమై
ఆ ఆత్మీయ చేతుల్ని ముద్దడుతుంటే .
కుచేలుడు లా  ఆ జన్మంతాం..
ఋణపడి వుంటూంది
ఆ స్నేహబంధం..
అహం వీడిన మానవత్వమై
వికసించిన మల్లెల పరిమళం లా.!
నాల్గురితో కలిసి జీవించే సమాజంలో
స్వార్థం తో కళ్ళు మూసుకుపోయి
కన్నుమిన్నేరుగక బలుపు పెంచుకుంటే
పాడే మోసే నలుగురు దొరకరని
కరోనా నేర్పిన నగ్న సత్యం..
ఈనాటి మనిషిలోని  ఆలోచన
దృక్పధం ను మార్చి.. ఆ నాల్గురితో
కలిసి సాగాలని లోపలి అంతరంగం
నేర్పుతున్న జీవిత పాఠం
రేపటి ఆశలకు అంకురం.!!
 –  రవీందర్‌ ‌కొండ, 9848408612
    ఆల్వాల్‌, ‌హైదరాబాద్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *