హైదరాబాద్ లో నడి బొడ్డున పుస్తకాల పండుగ
బడి పిల్లలతో మొదలు రిటైర్డ్ ఉద్యోగుల వరకు
సెలబ్రిటీల నుండి సామాన్యుల దాకా
పుస్తకాల తాకిడి జోరుగా సాగుతూ
పుస్తక ప్రియులకు పండుగ వాతావరణం వచ్చింది
బాల సాహిత్యం నేటి తరానికి అవసరం
నేడు శాస్త్ర సాంకేతికత పరుగులు తీస్తున్న
తరుణంలో పిల్లలకు పుస్తక పఠనం తప్పనిసరి
యువ సైన్యానికి పుస్తక పరిజ్ఞానం దిక్సూచి
నవ భారత నిర్మాణంలో యువత మేధస్సు
దేశ నలుమూలల రచయితల పుస్తకాలు
హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో లభ్యం
రోజుకు వెయ్యిలలో సందర్శకుల తాకిడి
లక్షలలో కొనుగోలు అమ్మకాలు ఆకర్షణీయమైన
బుక్ స్టాల్స్, జనంతో కిక్కిరిసి జాతరల దర్శనమిస్తూ
హైదరాబాద్ బుక్ ఫెయిర్….
తరలి రండి సాహిత్యానికి పూర్వ వైభవం తెద్దాం
భారత చరిత్ర మూలాలను కాపాడుకుందాం…..
– మిద్దె సురేష్, కవి, వ్యాసకర్త, 9701209355




