బీహార్‌లో ఇటుక బట్టీ పేలుడులో 9 మంది మృతి

పాట్నా, డిసెంబర్‌ 24 : ‌బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు చంపారణ్‌ ‌జిల్లాలోని నారీగిర్‌ ‌గ్రామంలో ఓ ఇటుక బట్టీకి చెందిన ఎత్తైన చ్ని పేలిపోయింది. ఈ ఘటనలో 9మంది కార్మికులు మృతి చెందారు. 10 మందికిపైగా గాయపడ్డారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు బలగాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి హాస్పిటల్‌ ‌లో చికిత్స  అందిస్తున్నారు.

ఇటుక బట్టీ యజమాని కూడా ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, బిహార్‌  ‌సీఎం నితీశ్‌ ‌కుమార్‌ ఈ ‌ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేల పరిహారం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *