బీసీల ఐక్యత చాటే సమయం ఆసన్నమైంది.. శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలి : తాండూర్ జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి

తాండూరు, ప్రజాతంత్ర, జులై 27: బీసీలు ఐక్యత చాటే సమయం ఆసన్నమైందని , వచ్చే శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆయా పార్టీలను డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని హిమాలయ ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐదు శాతం ఉన్న రెడ్డిలు 40 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నారు. 1 శాతం ఉన్న వెలమలు 10 అసెంబ్లీ స్థానల్లో ఉన్నారు. మరి 60 శాతం ఉన్న బీసీలు కేవలం 22స్థానాలో ఉండడం ఎంతవరకు సమంజసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి తదితర పార్టీలు కచ్చితంగా 60అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, లేకపోతే రాబోయే రోజుల్లో బీసీల సత్తా ఏంటో చూపెడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బీసీ బందు కేవలం 15 కులాలకు మాత్రమే చెందడం సబబు కాదని, బీసీ సామాజిక వర్గంలో 137 కులాలు ఉన్నాయి అది గ్రహించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలి అలాగే మైనార్టీలకు మైనార్టీ బంద్ ఇవ్వడం బీసీ సంఘం స్వాగతిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పలు సామాజిక వర్గాల గురించి ఎన్నో సభలో మాట్లాడారు మరి మీకు మా బీసీలు గుర్తుకు రాలేరా మా బీసీలాంటి ఎందుకు అంత చిన్న చూపు అది మీరు తెలుసుకోవాలని అన్నారు.
పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను కచ్చితంగా బీసీ జనాభా ప్రాతిపదికన తాండూర్ పరిగి అసెంబ్లీ స్థానం కచ్చితంగా బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత దశాబ్దాల పాటు సేవలందించిన మహారాజుల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బిజెపి పార్టీ బలోపేతానికి కృషిచేసిన బీసీ నాయకుడు రమేష్ కు తాండూర్ టికెట్ ఇవ్వాలి టిఆర్ఎస్ పార్టీ టికెట్ కూడా తాండూరు గడ్డపై పుట్టి పెరిగిన బీసీ నాయకునికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశం నందు బీసీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ శుకుర్, జిల్లా బీసీ సంఘం అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి, వడ్డే సమాజ అధ్యక్షులు శ్రీనివాస్, వాల్మీకి సమాజం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, నాయి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు పరమేష్, వీరశైవ సమాజ కార్యదర్శి లింగదల్లి రవికుమార్, పట్టణ బీసీ మహిళా అధ్యక్షురాలు నాయి కోడి జ్యోతి, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళా కార్యదర్శి ఉపాధ్యక్షురాలు అనిత, విజయలక్ష్మి, నరసమ్మ, పెద్దముల్, యాలాల్, బషీరాబాద్ మండలాల అధ్యక్షులు శ్రవణ్, లక్ష్మణాచారి, నరేందర్, కార్యదర్శి రాధాకృష్ణ, మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, హరి, అనిల్, బాలాజీ ఠాకూర్, రాము ముదిరాజ్ నవీన్ సురేష్ అజిత్, రాజు నరసింహ వెంకట్ సురేందర్, మతిన్ మహాదేవ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *