బీటిరోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: బిటి రోడ్ల నిర్మాణానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ అన్నారు. చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు జడ్పీచైర్ పర్సన్.. కూర మాణిక్య రెడ్డి తో కలసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు 2.5 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణ పనులు గాను రూ.2.50 కోట్లు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీష్ రావు సహకారంతో చిన్నకోడూరు మండలం అన్ రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు వెంకటేశం, వైస్ ఎంపిపి పాపయ్య, సొసైటీ చైర్మన్ కనకరాజు, బిఆర్ఎస్  పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాముని ఉమెష్ చంద్ర, ఎంపిటిసి ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్,ఇబ్రహీంనగర్ సర్పంచ్ సుభాష్, కో ఆప్షన్ మెంబర్ సాధక్,సీనియర్ నాయకులు  మధుసూదన్ రెడ్డి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *