బీజేపీ విజయం కోసం పాటుపడాలి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ఈ ఎన్నికల్లో కారు పార్టీని బోల్తా కొట్టించి కమలం వికసిస్తుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఫతే నగర్ డివిజన్ పరిధిలోని శివ శంకర్ నగర్ బస్తీ నుండి ప్రారంభమైన ఇంటింటికీ బీజేపీ భరోసా పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఇంటింటికీ బీజేపీ భరోసా పాదయాత్ర 64వ రోజుకు చేరుకుంది. గడప గడపకు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మరోసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఆదరణ పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, అధ్యక్షుడు ఉదయ్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కంచి మహేందర్, రాష్ట్ర ఓ.బి.సి మోర్చ నాయకులు రామ్మోహన్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ప్రమోద్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ బానేశ్, శ్రీనివాస్ రెడ్డి, రేవప్ప, డివిజన్ ప్రధాన కార్యదర్శిలు నరేష్, బ్రమ్మం, గోపాల్, నాగేష్, తులసి, కార్తిక్, సాయి, అర్జున్, అస్లాం చింటూ, పి శ్రీను, బి శ్రీను, అర్వింద్, రాకేష్, మనోజ్ , చైతన్య, ఉషారాణి, కృష్ణ వేణి, రమేష్, రాములు, అంజి, డివిజన్ ల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *