బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా అనూహ్యరెడ్డి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : భారతీయ జనత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు, తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షురాలు డాక్టర్‌ జి.అనూహ్యరెడ్డి నియమితులైయ్యారు. ఈమేరకు నియమాక పత్రాన్ని సోమవారం పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అనూహ్యరెడ్డికి అందజేశారు. కోవిడ్‌ సమయంలో అన్ని వర్గాల ప్రజలకు విస్తృతమైన సేవలందించిన అనూహ్యరెడ్డిని కార్యవర్గ సభ్యురాలిగా నియమించడం ఆనందంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీలకతీతంగా ఆమె చేస్తున్న సేవల్ని కొనియాడారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తూ అట్టడుగు వర్గాలవారికి అండగా నిలవాలంటూ పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి వన్నె తెస్తానని, పార్టీకి విధేయురాలిగా ఉంటానంటూ అనూహ్యరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *