బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కుల్కచర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మహారాష్ట్ర నాందేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అజీజ్,పశ్చిమ బెంగాల్ ఎబివిపి ఫూల్ టైమర్ ఈశ్వర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు లు అన్నారు. సోమవారం నాడు ఆ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ బూనేటిని గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలి.ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గాదె మహిపాల్,పిఎన్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, మండల నాయకులు కాటన్ పల్లి ఆంజనేయులు, వార్డు సభ్యులు కాటన్ మహిపాల్, నర్సింహారెడ్డి,రాంచెంద్రయ్య,మండల నాయకులు,బూత్ కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *