బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట నారాయణరెడ్డి

ఖరారు చేసిన పార్టీ అధిష్టానం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానానికి వెంకట నారాయణరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మిగిలిన స్థానిక సంస్థల స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఉపాధ్యాయ, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న వోట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. మార్చి 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ ‌జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలతోనే ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వొచ్చిందని ఎన్నికల కమిషన్‌ ‌తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *